
దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన పలువురు భక్తులు మంగళవారం విరాళాలు అందజేశారు. గొల్లపూడికి చెందిన వేమూరి సురేష్ కుటుంబం ఆలయ ఈవో శీనానాయక్‌ను కలిసి రూ. 1,00,116, సత్యనారాయణపురానికి చెందిన అనిల్, గోవిందరాజు, శైలెజల కుటుంబ సభ్యులు రూ. 1,00,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం ఇవ్వగా, దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.