
పోలీసుల ఆరోగ్య సంరక్షణకు ‘హెల్త్ ఫస్ట్–1991’
లబ్బీపేట(విజయవాడతూర్పు): నిరంతరం ప్రజాసేవలో మమేకమవుతున్న పోలీసులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణ కోసం రూపొందించిన ‘హెల్త్ ఫస్ట్ 1991’ యాప్‌ను గురువారం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ యాప్‌లో 14 వేల మందికిపైగా పోలీసులు, వారి కుటుంబ సభ్యులు, వారిపై ఆధారపడిన సభ్యులు అనుసంధానమై ఉంటారని ఆయన తెలిపారు. నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు మాట్లాడుతూ పోలీసుల వైద్య సేవల కోసం ఆరోగ్య భద్రత ఉన్నప్పటికీ, అన్ని రకాల సేవలు దానిలో కవర్ కావడం లేదని, దీంతో చాలా మంది సిబ్బంది ఇబ్బంది పడుతున్నట్లు గ్రహించి, 1991 బ్యాచ్ పోలీసు అధికారులు చొరవ చూపినట్లు తెలిపారు.
29 ప్రత్యేక విభాగాల్లో..
జిల్లాలోని 26 ప్రముఖ హాస్పిటల్స్‌తో మాట్లాడి ఉచిత కన్సల్టేషన్‌తో పాటు, వైద్య ఖర్చులో 20 నుంచి 30 శాతం రాయితీ ఇచ్చేలా అంగీకారం కుదుర్చుకున్నట్లు సీపీ తెలిపారు. అందులో భాగంగా 29 ప్రత్యేక విభాగాల్లో 106 మంది డాక్టర్లు స్పందించి పోలీసులకు సేవలు అందించేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. డీసీపీ కేజీవీ సరిత, 1991 అధికారులు పాల్గొన్నారు.
పెడన: మండలంలోని బలిపర్రు గ్రామంలో ఉన్న లిల్లి స్వయం సహాయక సంఘం(ఎస్‌హెచ్‌జీ) సభ్యురాలు కొణతం వినీత కలంకారి యూనిట్‌ను గురువారం సెర్ప్ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా మోర్డ్, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం జాతీయ స్థాయి మేనేజరు లక్ష్మీకాంత్ పరసర్, జిల్లా ఏడీ శ్రీధరరావు కలంకారీ తయారీదారులతో మాట్లాడి ఎంటర్‌ప్రెన్యూర్‌గా వ్యాపారం ఎలా అభివృద్ధి చేసుకోవాలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో సెర్ప్ బృందం సభ్యులు వాల్మీకి, సత్యభామ, శోభారాణి పాల్గొన్నారు.
యాప్‌ను ఆవిష్కరించిన
ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖరబాబు