
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద
కృష్ణలంక(విజయవాడతూర్పు): ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని రౌండ్‌టేబుల్ సమావే శంలో వక్తలు హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించా లని డిమాండ్ చేశారు. రాఘవయ్య పార్కు సమీపం లోని బాలోత్సవ భవన్‌లో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మో హన్‌రావు అధ్యక్షతన మంగళవారం ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. పీడీఎఫ్ ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గమన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరమైతే విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుందన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ అయితే 300 బెడ్ల సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నడపాలని కేంద్ర వైద్య శాఖ చేసిన విధానం వల్ల ఎంతో మంది పేదలకు మేలు జరుగుతుందన్నారు. ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్‌షిప్‌లోకి మారితే ఈ ఫలాలు పేదలకు అందవన్నారు. ప్రైవేటుపరం చేయాలనుకున్న పది మెడికల్ కాలేజీలు ఉన్న పది జిల్లాలు అత్యంత వెనుకబడిన ప్రాంతాలని పేర్కొన్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీగా రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వాయిదా తీర్మానం ప్రవేశపెడతానన్నారు. మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ.. పీపీపీ విధానంతో ఆ ప్రాంతాల అభివృద్ధి కుంటుపడడమే కాకుండా పేద ప్రజలకు నష్టం జరుగుతుందన్నారు. విద్యార్థి సంఘాలన్నీ ఐక్య కార్యాచరణ రూపొందించి ముందుకు సాగాలని సూచించారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయకూడదని, ప్రభుత్వంలోనే నడవా లని, అందుకు ఐక్యంగా ఉద్యమిస్తామని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జన చైతన్య వేదిక నాయకుడు లక్ష్మణరెడ్డి, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, వైఎస్సార్ ఎస్‌యూ రాష్ట్ర నాయకుడు చైతన్యబాబు, టాక్స్ పేయర్స్ అసోసియేషన్ నాయకుడు ఎం.వి. ఆంజనేయులు, పీటీఎల్‌పీ నాయకుడు ఎం.సూర్యా రావు తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు