
నగరానికి స్వచ్ఛతా లీగ్ పురస్కారం
పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగర పాలక సంస్థకు జాతీయ స్థాయిలో మరో అవార్డు వచ్చింది. దేశంలోని నగరాల్లో పరిశుభ్రతపై నిర్వ హించే స్వచ్ఛ సర్వేక్షణ్–2024లో వీఎంసీ స్వచ్ఛతా లీగ్ పురస్కారాన్ని అందుకుంది. న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో గురువారం స్వచ్ఛ సర్వేక్షణ్ పురస్కారాల ప్రదానోత్సవంలో సూపర్ స్వచ్ఛతా లీగ్ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ నారాయణ, వీఎంసీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర అందుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 2021 తర్వాత మళ్లీ 2024కు సంబంధించి రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఇది రెండోసారని తెలిపారు. ఈ పురస్కారం అందుకోవడానికి ప్రజలు, పారిశుద్ధ్య కార్మికులు ముఖ్యకారణమన్నారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ ఏపీలో ఐదు నగరాలకు పురస్కారం లభించడం ఆనందంగా ఉందన్నారు. కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా గార్బేజ్ ఫ్రీ సిటీలో సెవెన్ స్టార్ రేటింగ్ వచ్చిందని తెలిపారు. అవార్డు అందుకున్నవారిలో కార్పొరేషన్ నుంచి అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డి. చంద్రశేఖర్, ఎస్‌ఈ (ప్రాజెక్ట్స్)పి సత్యకుమారి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ రజియా షబినా తదితరులు ఉన్నారు.
గార్బేజ్ ఫ్రీ సిటీల్లో జాతీయస్థాయిలో 7వ స్టార్ ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము నుంచి అవార్డు అందుకున్న మంత్రి నారాయణ, వీఎంసీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర