
గిరి ప్రదక్షిణకు తరలివచ్చిన భక్తజనం
ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లు కొలువై ఉన్న ఇంద్ర కీలాద్రి గిరి ప్రదక్షిణకు అశేష భక్తజనం తరలివచ్చింది. గురువారం తెల్లవారుజామున 5.55 గంటలకు దుర్గగుడి ఘాట్‌రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం వద్ద ప్రచార రథంపై కొలువై ఉన్న శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు ఆలయ అర్చకులు పూజలు నిర్వహించగా, ఆలయ ఈఓ శీనానాయక్ దంపతులు పాల్గొన్నారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తుల కోలాట నృత్యాల మధ్య గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. వందల మంది భక్తులు అమ్మవారి ప్రచార రథం వెంట సాగుతూ ఎనిమిది కిలో మీటర్ల గిరి ప్రదక్షిణను పూర్తి చేశారు.