
కిటకిటలాడిన క్యూలైన్లు
గురుపౌర్ణమి, ఆషాఢ మాసోత్సవాలు, శాకంబరీ ఉత్సవాల నేపథ్యంలో గురువారం ఉదయం నుంచే దుర్గగుడి భక్తులతో కిటకిటలాడింది. ఘాట్‌రోడ్డు, మహా మండపం లిఫ్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్న భక్తులు రూ.500, రూ.300, రూ.100, సర్వ దర్శనం క్యూలైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వీఐపీ దర్శనాలు నిలిపివేశారు. అమ్మవారి దర్శనంలో భక్తులకు ఎటు వంటి ఇబ్బందులూ కలుగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. అంతరాలయ దర్శనం నిలిపివేయడంతో పాటు రూ.300 టికెట్ క్యూలైన్‌లో నియమించిన అర్చకుడిని సైతం అక్కడి నుంచి పంపేశారు. దీంతో కొద్దిసేపు ఆలయ అర్చకులు, అధికారులకు స్వల్ప వివాదం చోటు చేసుకుంది. ప్రధాన ఆలయంలో పాదుకలను నిలిపివేయగా, వేద ఆశీర్వచనం విధుల్లో ఉన్న అర్చకులు ఆలయం నుంచి వెలుపలకు వచ్చేశారు. ఈ వ్యవహారాన్ని ఆలయ ఈఓ దృష్టికి తీసుకెళ్లగా అర్చకులతో ఆయన మాట్లాడి సమస్యను పరిష్కరించారు.