
నీరాజనం
మహానేతకు
మనసున్న మారాజు.. మహానేత.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని జిల్లా ప్రజలు మనసారా స్మరించుకున్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని మంగళవారం వాడవాడలా మహానేత విగ్రహాలు, చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆయన పాలనలో లబ్ధిపొందిన సామాన్య ప్రజలు స్వచ్ఛందంగా జయంతి వేడుకలు నిర్వహించారు.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు జిల్లాలో మంగళవారం ఘనంగా జరిగాయి. వాడవాడలా ఉన్న వైఎస్ విగ్రహాలకు వైఎస్సార్ సీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేకులు కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. జిల్లాతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయనతో తమకున్న స్మృతులను నెమరు వేసుకు న్నారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. పలుచోట్ల పేదలకు దుస్తులు, రోగులకు పండ్లు పంచిపెట్టారు. పేదలకు అన్నసంతర్పణ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదానం చేశారు.
● విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ సూచనల మేరకు పార్టీ నాయ కుడు వై.సిద్ధార్థ, సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబు ఆధ్వర్యంలో డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో పాటు, పలువురు కార్పొరేటర్లు, డివిజన్ ఇన్‌చార్జ్‌లు, పార్టీ ముఖ్యనేతలు పాల్గొని వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. కేకు కట్ చేసిన నాయకులు ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. నియోజకవర్గంలోని 21 డివిజన్లలో కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
● విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో జరిగిన వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకల్లో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదానం, అన్నదానం, వస్త్రదానం, పండ్లు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించారు. భవానీపురంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కొరివి చైతన్య ఆధ్వర్యంలో 50 మందికి పైగా యువకులు రక్తదానం చేశారు.
● విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధి లోని పోలీసు కంట్రోల్ రూమ్ సమీపంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద ఆయన జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జులు మల్లాది విష్ణు, వెలం పల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నాయకులు అడపా శేషు, బెల్లం దుర్గ, పుణ్యశీల, జమల పూర్ణమ్మ, తోలేటి రవిచంద్ర, వేములకొండ తిరుపతిరావు, దొడ్డ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహితం కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జి మల్లాది విష్ణు ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
● వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో బీఆర్టీఎస్ రోడ్డులో నిర్వహించిన వైఎస్సార్ జయంతి వేడుకల్లో గౌతంరెడ్డి పాల్గొని మునిసిపల్ ఇంజినీరింగ్ వర్కర్లకు దుస్తులు పంపిణీ చేశారు.
● నందిగామ నియోజకవర్గంలో నందిగామ వైఎస్సార్ సీపీ కార్యాలయంలో, కంచికచర్ల నెహ్రూ బొమ్మ సెంటర్‌లో నిర్వహించిన వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకల్లో నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు పాల్గొన్నారు. నాలుగు మండలాల్లో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
● జగ్గయ్యపేటలోలో నిర్వహించిన వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకల్లో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు, రాష్ట్ర సంయుక్త కార్య దర్శి మండవ శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి పాల్గొన్నారు.
● మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం రింగుసెంటర్, కీలేశపురం గ్రామాల్లో నిర్వహించిన రాజశేఖరరెడ్డి జయంతి వేడుకల్లో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ జోగి రమేష్ పాల్గొన్నారు. మైలవ రంలో నిర్వహించిన వైఎస్సార్ జయంతి వేడుకల్లో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి అప్పిడి కిరణ్‌కుమార్‌రెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పామర్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
● తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు పట్టణంలో వైఎస్సార్ సీపీ కార్యాలయం, పోలీస్ సర్కిల్ కార్యాలయం సెంటర్, బోయ బజార్, జైబావి సెంటర్, పీటీ కొత్తూరు గ్రామాల్లో నిర్వహించిన వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్లో నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామిదాసు పాల్గొన్నారు. నాలుగు మండలాల్లో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
● మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు పెనమలూరు నియోజకవర్గం అంతటా జరిగాయి. కంకిపాడు వేడుకల్లో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి పాల్గొన్నారు. మహానేత విగ్రహానికి జెడ్పీటీసీ బాకీ బాబు, మండల అధ్యక్షురాలు మాదు శ్రీహరిరాణితో కలిసి పూల మాల వేసి నివాళులర్పించారు. కానూరు వృద్ధుల ఆశ్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి అన్నే వేణుగోపాల కృష్ణమూర్తి (చిట్టిబాబు) వితరణతో వృద్ధుల అన్న సంతర్పణ చేశారు.
● గన్నవరం నియోజకవర్గంలోని గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, విజయవాడ రూరల్ మండలాల్లో గ్రామ గ్రామాన వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి కార్యక్రమాలు జరిగాయి.
వాడవాడలా ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు రాజన్న విగ్రహాల వద్ద నివాళులర్పించిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాల నిర్వహణ యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు పేదలకు దుస్తులు, రోగులకు పండ్లు పంపిణీ చేసిన నాయకులు

నీరాజనం

నీరాజనం