
మారని అధికారులు..
నమో వాయుపుత్ర
శ్రీ ఆంజనేయం.. ప్రసన్నాంజనేయం.. భజేహం పవిత్రం.. అంటూ భక్తులు హనుమంతుడిని భక్తితో కొలిచారు. జై హనుమాన్.. జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. హనుమత్ జయంతి సందర్భంగా గురువారం వాడవాడలా అభయాంజనేయుడికి ప్రత్యేక పూజలు చేశారు. విశ్వహిందూ పరిషత్ మహానగర్ ఆధ్వర్యంలో విజయవాడ బీఆర్‌టీఎస్ రోడ్డులో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. శైవపీఠాధిపతి శివస్వామి ర్యాలీని ప్రారంభించారు. భారీ సంఖ్యలో హాజరైన హనుమాన్ భక్తులు జెండాలు చేత పట్టుకొని ఉత్సాహంగా ముందుకుసాగారు. మహిళలు కూడా బైక్‌లపైకి ఎక్కి నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ
అభయాంజనేయుడికి భక్తజన నీరాజనం
హనుమాన్‌జంక్షన్ రూరల్: హనుమాన్‌జంక్షన్‌లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. జై హనుమాన్ నామస్మరణలతో మార్మోగింది. అంజనీపుత్రుడిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. హనుమజ్జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం ప్రసిద్ధ శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో తెల్లవారుజాము మూడు గంట ల నుంచే బారులు తీరారు. స్వామివారిని నూతన వస్త్రాలు, బంగారు, వెండి ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. ఉదయం 4 గంటలకు ప్రభాతసేవ, అర్చన, వేదపారాయణం నిర్వహించారు. హనుమాన్‌జంక్షన్ లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 25 వేల మందికి అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం వైభవంగా సాగింది.
ర్యాలీ ప్రారంభం.. జెండా ఊపి ర్యాలీ ప్రారంభిస్తున్న శైవపీఠాధిపతి శివస్వామి తదితరులు
అధికారులకు
ఆదేశాలిచ్చాం: కలెక్టర్లు
సర్వసభ్య సమావేశంలో సభ్యుల ఆవేదనను అర్థం చేసుకున్నామని, ఇకపై ఎటువంటి కార్యక్రమాలు జరిగినా సంబంధిత ప్రజాప్రతినిధులకు సమాచారం అందించేలా అధికారులకు ఆదేశాలిచ్చామని కృష్ణా ఇన్‌చార్జి కలెక్టర్ గీతాంజలిశర్మ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా సభలో ప్రకటించారు. అలాగే జిల్లా పరిషత్ ద్వారా ఆయా మండలాలకు మంజూరైన నిధులు త్వరితగతిన నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజలకు సేవ చేసేందుకు ప్రజల ద్వారా ఎన్నికై న తాము ప్రజలకు చేయాల్సిన పనులు చేయలేకపోతున్నామని.. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు తమకు సమాచారం ఇవ్వటం లేదని.. కనీసం ప్రొటోకాల్ పాటించటం లేదని జెడ్పీటీసీ, ఎంపీపీలు వాపోయారు. గురువారం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో జెడ్పీ సర్వసభ్య సమావేశం చైర్ పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సమావేశానికి సంబంధిత అధికారులు, మంత్రులు హాజరు కాకపోవడంపై స్థానిక సంస్థల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు రారు.. మంత్రులు కనిపించరు.. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ విషయంలో ప్రతి సర్వసభ్య సమావేశంలో అధికారులకు చెబుతున్నా పట్టించుకోవటం లేదని, ఈ రోజు మాత్రం తమకు కచ్చితమైన హామీ ఇవ్వాలని వారు భీష్మించుకొని కూర్చున్నారు.
గౌరవం ఇవ్వరా..
క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులుగా ఉన్న తమకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎటువంటి గౌరవం దక్కటం లేదని జెడ్పీటీసీ, ఎంపీపీలు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక దాదాపుగా 18 నెలలుగా తమకు గౌరవవేతనం చెల్లించకుండా తాత్సారం చేస్తున్నారని, సమావేశానికి రావాలంటే తమకు రూ.5వేలు ఖర్చవుతోందని అయినప్పటికీ ప్రజాసేవ కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం సమావేశంలో తెలియపరిచేందుకు తామిక్కడికి వస్తే సంబంధిత అధికారులు ఉండరూ, మంత్రులు హాజరుకారు.. ఇలా అయితే గ్రామాల్లో తమకు ప్రాధాన్యం ఏముంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు తమ గోడును వెళ్లబుచ్చుకున్నా అధికారులు కూటమి నాయకుల ఒత్తిళ్లకు లొంగిపోతున్నారన్నారు. పేరుకు శిలాఫలకాలపై పేర్లు ఉన్నప్పటికీ ఆ కార్యక్రమం గురించి తమకు సమాచారం ఇవ్వటం లేదని ఆరోపించారు. గౌరవవేతనం ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారన్నారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా జీతాలు నిలుపుదల చేస్తే తమ బాధ అర్థమవుతుందన్నారు.
నిరసనగా బాయ్‌కాట్..
సర్వసభ్య సమావేశంలో జెడ్పీటీసీ, ఎంపీపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానం రాకపోవటంతో కొద్దిసేపు పోడియం వద్ద నిరసన తెలిపారు. అనంతరం అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వకపోవటంతో సమావేశం నుంచి బాయ్‌కాట్ చేసి సమావేశ మందిరం బయట నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ప్రొటోకాల్ పాటించాలి, గౌరవవేతనం వెంటనే చెల్లించాలంటూ నినాదాలు చేశారు. అలాగే తమ మండలాల్లో కూటమి నాయకులు చేస్తున్న అరాచకాలను ప్రశ్నించాలని వస్తే సంబంధిత అధికారులు, శాసనసభ్యులు ఎవరూ ఉండరని, సమాధానం ఎలా వస్తుందని వాపోయారు.
చర్చలు జరిపినా ససేమిరా..
సమావేశం నుంచి బాయ్‌కాట్ చేసిన అనంతరం జెడ్పీటీసీ, ఎంపీపీలతో ఇన్‌చార్జ్ సీఈవో ఆర్‌సీ ఆనంద్‌కుమార్ చర్చలు జరిపారు. ఈ విషయాలపై ఉన్నతాధికారులకు తెలియజేస్తామని, గౌరవవేతనం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తామని చెప్పినప్పటికీ స్పష్టమైన హామీ కావాలంటూ వారు ఒప్పుకోలేదు. ఇకపై ఉమ్మడి జిల్లాకు చెందిన ఇరువురు మంత్రులు, శాసనసభ్యులు, అధికారులందరూ ఉంటేనే సమావేశం నిర్వహించాలని.. అలా అయితేనే తమను ఆహ్వానించాలని ఘంటాపదంగా చెప్పారు.
పోడియం వద్ద నిరసన తెలుపుతున్న జెడ్పీటీసీ, ఎంపీపీలు
స్థానిక సంస్థలను చిన్నచూపు చూస్తున్నారంటూ ఆవేదన ప్రొటోకాల్ అమలు కావడం లేదని నిరసన 18 నెలలుగా గౌరవ వేతనం ఇవ్వకపోవడంపై ఆందోళన ఎమ్మెల్యేల జీతాలు కూడా ఆపేయండంటూ నిలదీత చర్చలు జరిపినా ససేమిరా అన్న ప్రజాప్రతినిధులు సమావేశాన్ని వాయిదా వేసిన చైర్‌పర్సన్ ఉప్పాల హారిక
స్థానిక సంస్థలు ఉండాలా.. వద్దా?: చైర్ పర్సన్ హారిక
స్థానిక సంస్థలను ప్రవేశపెట్టి క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రజల నుంచి ఎన్నికై న తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఎక్కడా ప్రోటోకాల్ అమలు జరగటం లేదని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. ఏ పనులు జరిగినా సంబంధితశాఖల అధికారులు సంబంధిత ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వటం లేదన్నారు. గౌరవవేతనం గురించి తాము ప్రభుత్వానికి రెండు సార్లు లేఖ రాసినా దానిని తిరిగి పంపించి వేశారన్నారు. ఇటువంటి పరిణామాలు చోటుచేసుకున్న దృష్ట్యా జెడ్పీటీసీలు, ఎంపీపీలు సమావేశంలో స్పష్టమైన హామీ వస్తుందని ఆశపడి భంగ పడటంతో బాయ్‌కాట్ చేసి వెళ్లిపోయారన్నారు. తక్షణమే దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. తొలుత జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పెహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన 26 మంది ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో నూజివీడు సబ్‌కలెక్టర్ స్మరణ్‌రాజ్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మూడు జిల్లాల అధికారులు పాల్గొన్నారు.

మారని అధికారులు..

మారని అధికారులు..

మారని అధికారులు..

మారని అధికారులు..