ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల స్థలాన్ని పరిరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల స్థలాన్ని పరిరక్షించాలి

May 22 2025 12:31 AM | Updated on May 22 2025 12:31 AM

ఎస్‌ఆ

ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల స్థలాన్ని పరిరక్షించాలి

మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): నగరం నడిబొడ్డున గులాబీతోట బీఆర్టీఎస్‌రోడ్డు సమీపంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన రూ.300 కోట్లకు పైగా విలువచేసే 6.67 ఎకరాల స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని కళాశాల విద్యార్థులు, పూర్వ విద్యార్థులు కోరుతున్నారు. ఎంతో ఘన చరిత్ర కలిగి, ఎంతోమంది మేధావులను దేశానికి అందించిన ఈ కళాశాల స్థలాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కాసుల కోసం కక్కుర్తి పడి అధికారులు, అధికార పార్టీ నేతలు కళాశాల స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు యత్నాలు జరుగుతున్నాయి. ఈ స్థలాన్ని అధికార పార్టీ నేతల అండదండలతో కాజేసేందుకు యత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఈ విషయమై ఇప్పటికే కళాశాల పూర్వ విద్యార్థులు జిల్లా కలెక్టర్‌, మంత్రి నారా లోకేష్‌ను కలిసి కళాశాల స్థలాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన నారా లోకేష్‌ కళాశాల స్థలాన్ని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. దీంతో జిల్లా కలెక్టర్‌ కళాశాల స్థలాన్ని నిషేధిత జాబితాలో పెడతామంటూ హామీ ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇంత వరకు ఈ స్థలాన్ని నిషేధిత జాబితాలో చేర్చలేదని కళాశాల విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అధికారులు నోరు మెదపకపోవటం అనుమానాలకు తావిస్తుండగా మరోపక్క ఇటీవల ఇక్కడ స్థలాన్ని కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తులు భవన నిర్మాణాల ప్లాన్‌ల కోసం అడ్డదారులలో ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రూ.300 కోట్ల విలువైన

స్థలంపై పెద్దల కన్ను

ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు

అధికార పార్టీ నేతల యత్నం

నిషేధిత జాబితాలో చేర్చాలని

కోరుతున్న పూర్వ విద్యార్థులు

22(1)ఏ నిషేధిత జాబితాలో చేర్చాలి

ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలాన్ని ఎటువంటి లావాదేవీలు జరగకుండా 22(1)ఏ నిషేధిత జాబితాలో చేర్చాలని నగరవాసులు, కళాశాల విద్యార్థులు, పూర్వ విద్యార్థులు కోరుతున్నారు. కళాశాల స్థలాన్ని ఎట్టి పరిస్ధితులలోను అన్యాక్రాంతం కాకుండా చూస్తామని, ఇందుకు అవసరమైతే ఎంత దూరం వెళ్లటానికై నా తాము సిద్ధంగా ఉన్నామని పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు లంకా జానయ్య, కళాశాల రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వెలగా జోషి అంటున్నారు. అసలు కోర్టులో ఉన్న కళాశాల స్థలాన్ని ఏ విధంగా క్రయ విక్రయాలు జరుపుతారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కళాశాల స్థలాన్ని 22(1)ఏ నిషేధిత జాబితాలో చేర్చటంతో పాటు ఇప్పటికే ఆక్రమించిన ఆక్రమణలను కూడా తొలగించి కళాశాల అభ్యున్నతికి సహకరించాలని కోరుతున్నారు.

ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల స్థలాన్ని పరిరక్షించాలి 1
1/1

ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల స్థలాన్ని పరిరక్షించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement