
సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాల
● 10,381 మంది అభ్యర్థులు, 25 పరీక్ష కేంద్రాలు ● ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఈనెల 25న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్ లక్ష్మీశ యూపీఎస్సీ ప్రిలిమ్స్ నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 25 కేంద్రాల్లో 10,381 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 25న ఆదివారం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్ష జరగనుందన్నారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి లోకల్ ఇన్‌స్పెక్టింగ్ కమ్ లైజన్ ఆఫీసర్, రూట్ అధికారులు, సూపర్ వైజర్లు, స్ట్రాంగ్ రూమ్ భద్రతా సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్యం, విద్యుత్, ఏపీఎస్‌ఆర్‌టీసీ, సమావేశంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, ఆర్డీవోలు కావూరి చైతన్య, కె.బాలకృష్ణ, కె.మాధురి, కలెక్టరేట్ కోఆర్డినేషన్ విభాగం సూపరింటెండెంట్ సలీమ్, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం.సుహాసిని, లైజనింగ్ అధికారులు, సహాయ లైజనింగ్ అధికారులు, వెన్యూ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.