
ఐసెట్‌లో జిల్లా విద్యార్థికి మూడో ర్యాంక్
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఐసెట్‌లో ఎన్టీఆర్ జిల్లా విద్యార్థి రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంక్ సాధించాడు. ఐసెట్ ఫలితాలను విశాఖపట్నంలో ఆంధ్రా విశ్వవిద్యాలయం మంగళవారం విడుదల చేసింది. ఈ ఏడాది ఐసెట్‌ను ఆంధ్రా విశ్వవిద్యాలయం నిర్వహించింది. విజయవాడ కృష్ణలంకకు చెందిన సకల కృష్ణ సాయి మూడో ర్యాంక్ సాధించాడు. ఎన్టీఆర్ జిల్లా నుంచి 2,528 మంది విద్యార్థులు ఐసెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. 2,271 మంది పరీక్షకు హాజర య్యారు. వారిలో 1,012 మంది బాలురు, 1,259 మంది బాలికలు ఉన్నారు. వారిలో 2,191 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారు. కృష్ణాజిల్లా నుంచి 713 మంది విద్యార్థులు ఐసెట్‌కు దరఖాస్తు చేసుకోగా 668 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 311 మంది బాలురు, 357 మంది బాలికలు ఉన్నారు. 638 మంది విద్యార్థులు అర్హత సాధించి ర్యాంకులు పొందారు. వారిలో 299 మంది బాలురు, 339 మంది బాలికలు ఉన్నారు.