
కార్తికేయుని సేవలో ప్రముఖులు
మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవిలో వేంచేసియున్న శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని కేంద్ర ప్రభుత్వ హౌసింగ్ బోర్డు డైరెక్టర్, తమిళనాడు రాష్ట్రం ఎయిర్ పోర్ట్‌ల అడ్వైజరీ కమిటీ సభ్యుడు గూడూరు రాధాకృష్ణ కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. అలాగే విశ్రాంత సీఎస్ ఎల్‌వీ సుబ్రహ్మణ్యం సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందజేసి ఆలయ మర్యాదలతో సత్కరించారు.
సత్యదేవుని ఆలయానికి రూ. లక్ష విరాళం
గుడ్లవల్లేరు: స్థానిక శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి దేవాలయ గోపుర అభివృద్ధి పనులకు రూ.1,08,000ను సోమవారం దాతలు అందించారు. అట్లూరి సత్యనారాయణ, భాస్కరరావు, వీరమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు అట్లూరి వీరప్రభు చలపతి, రామకృష్ణ దుర్గా వరప్రసాద్, కుమార్తెలు కొండపల్లి వీర కుమారి, చాపరాల కస్తూరి చేతుల మీదుగా ఈ విరాళాన్ని గుడ్లవల్లేరు ఎస్‌ఈఆర్‌ఎం విద్యా సంస్థల చైర్మన్ వల్లభనేని వెంకట్రావుకు అందించారు.
క్రికెట్ అండర్–15 జిల్లా బాలికల జట్టు ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: ఉమ్మడి కృష్ణాజిల్లా అండర్–15 బాలికల క్రికెట్ జట్టును కృష్ణాజిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.రవీంద్రచౌదరి సోమవారం ప్రకటించారు. టి.సౌమ్య (కెప్టెన్), డి.షాలినీచౌదరి, పి.లక్ష్మీలోహిత, టి.కావ్య, కె.మేఘనసాయి, ఆర్.తేజశ్వని, పి.ఆనందదీప్తి, బి.కార్తీక, కె.రుత్వేకఆరాధ్య, కె.జస్వితసాయిరెడ్డి, బి.తమిళిక, కె.మేఘన, ఆర్.లక్ష్మీప్రసన్న, జి.హరణి, కె.అక్షయ, కె.స్పూర్తి, పి.హనీషా, కె.కుశిక జట్టులో చోటు దక్కించుకున్నారని పేర్కొన్నారు. 2025–26 సీజన్‌లో రాష్ట్ర స్థాయి పోటీలకు ఈ జట్టు ఉమ్మడి కృష్ణాజిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తుందని వెల్లడించారు.
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
ఆటోనగర్(విజయవాడతూర్పు): ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా తొలి రోజు 23మంది సభ్యులు నామినేషన్ దాఖలు చేసినట్టు ఎన్నికల అధికారులు పంచకర్ల వెంకటరమణారావు, తాడేపల్లి శ్రీనివాస దివాకర్ తెలిపారు. మంగళవారం సాయంత్రానికి నామినేషన్ల పర్వం ముగుస్తుందని చెప్పారు. మొత్తం 21 వార్డు మెంబర్లకుగానూ తొలి రోజే 23 నామినేషన్లు వచ్చినట్లు తెలిపారు. ఈ నెల 29న ఎన్నికలు నిర్వహించనున్నట్టు చెప్పారు. గతంలో ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంధం వెంకటేశ్వరరావు నామినేషన్ వేశారు. ఈసారి అదనంగా ఇద్దరు వార్డు సభ్యు లు నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈ సారి అధ్యక్షుడికి మంచి పోటీ ఉన్నట్టు తెలుస్తోంది.
ఉత్తమ నాటికగా
‘చీకటి పువ్వు’
చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: చిలకలూరిపేటలో కళాకారుల ప్రతిభా వేదికగా నిలిచిన తొమ్మిదో ఆహ్వాన నాటికల పోటీలు ఆదివారం రాత్రితో ఘనంగా ముగిశాయి. చిలకలూరిపేట కళా పరిషత్, సీఆర్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహించిన ఈ మూడు రోజుల కళా ఉత్సవం 9 నాటికల ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించింది. బహుమతులు అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. చైతన్య కళాభారతి(కరీంనగర్) వారి ‘చీకటి పువ్వు’నాటిక ఉత్తమ ప్రదర్శనగా ఎంపికై బహుమతిని సొంతం చేసుకుంది. అమృత లహరి థియేటర్ ఆర్ట్స్(గుంటూరు) వారి ‘నాన్న నేను వచ్చేస్తా’ నాటిక ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా నిలవగా, అమరావతి ఆర్ట్స్’ (గుంటూరు) వారి ‘చిగురు మేఘం’ నాటిక తృతీయ ఉత్తమ ప్రదర్శనగా ఎంపికై ంది.

కార్తికేయుని సేవలో ప్రముఖులు

కార్తికేయుని సేవలో ప్రముఖులు