
ఏపీ ఈఏపీ సెట్ ప్రారంభం
తొలి రోజు ఎన్టీఆర్ జిల్లాలో 91.21, కృష్ణాలో 95.71 శాతం హాజరు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఇంజినీరింగ్, అగ్రికల్చల్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ పరీక్ష(ఏపీ ఈఏపీ సెట్)– 2025 సోమవారం ప్రారంభమైంది. తొలి దశలో రెండు రోజుల పాటు అగ్రికల్చర్, ఫార్మసీ (బైపీసీ) విద్యార్థులకు నిర్వహించనున్నారు. మొదటి రోజు ఉమ్మడి జిల్లాలో మొత్తం 15 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, అలాగే మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పరీక్షలు కొనసాగాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఉదయం సెషన్‌కు 1,700 మందికి 1,555 మంది హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం సెషన్‌కు 1,700 మందికిగానూ 1,546 మంది పరీక్ష రాశారు. అదేవిధంగా కృష్ణాజిల్లాలో ఉదయం సెషన్‌కు 291 మందికి 282మంది, మధ్యాహ్నం సెషన్‌కు 292 మందికి 276 మంది హాజరయ్యారు. కృష్ణాలో 95.71, ఎన్టీఆర్‌లో 91.21శాతం హాజరైనట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం 3,983 మందికి 3,659 మంది పరీక్ష రాశారు.

ఏపీ ఈఏపీ సెట్ ప్రారంభం