
తొలి రోజు పరీక్ష ప్రశాంతం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి, ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. పరీక్షల సందర్భంగా ఆయా పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పాఠశాల విద్య, అధికారులతో పాటుగా రెవెన్యూ, పోలీసు, మెడికల్ తదితర శాఖల సంయుక్త ఆధ్వర్యంలో కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేశారు.
61.04 శాతం హాజరు..
ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రారంభమైన పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 61.04 శాతం విద్యార్థులు హాజరయ్యారు. తొలి రోజు 1,014 మంది విద్యార్థులకు 30 పరీక్ష కేంద్రాలను కేటాయించారు. అందులో 614 మంది హాజరుకాగా 395 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు కేటాయించిన మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు 27 కేంద్రాలను పరిశీలించారు. విద్యాశాఖ ప్రాంతీయ సంచాలకులు జోన్–2 (కాకినాడ) జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (కొండపల్లి)లోని పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. అలాగే ఎస్‌పీఎన్‌ఆర్‌సీ ఉన్నత పాఠశాల (గొల్లపూడి) కేంద్రాన్ని పరిశీలించారు. డీఈవో యూవీ సుబ్బారావు విజయవాడలోని ఏపీఎస్‌ఆర్ మునిసిపల్ ఉన్నత పాఠశాల కృష్ణలంక వీఎంసీ ఉన్నత పాఠశాల, పటమట జీడీఈటీ ఉన్నత పాఠశాల, సీవీఆర్ ఎంసీ ఉన్నత పాఠశాల తదితర పరీక్ష కేంద్రాలను పరిశీలించారు.
జిల్లాలో ‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం