
ఇద్దరు రైల్వే ఉద్యోగులకు సేఫ్టీ అవార్డులు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైళ్ల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించిన విజయవాడ డివిజన్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులకు ‘జీఎం మ్యాన్ ఆఫ్ ద మంత్ సేఫ్టీ అవార్డు’ లభించింది. సోమ వారం జోనల్ హెడ్ క్వార్టర్స్ సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం నుంచి విజయవాడ డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్‌తో పాటు సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, గుంతకల్లు, నాందే డ్ డివిజన్‌ల డీఆర్‌ఎంలతో వర్చువల్ పద్ధతిలో భద్రతపై జీఎం అరుణ్‌కుమార్ జైన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రయాణికుల సురక్షిత ప్రయాణం, భద్రతలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. క్రమం తప్పకుండా అన్ని సెక్షన్‌లలో సేఫ్టీ డ్రైవ్‌లు నిర్వహిచాలని ఆదేశించారు. అనంతరం విజయవాడ డివిజన్‌లో విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించిన కాకినాడలోని మెకానికల్ విభాగానికి చెందిన టెక్నీషియన్ దార్ల బంగారి, గన్నవరంలోని ఆపరేటింగ్ విభాగానికి చెందిన స్టేషన్ మేనేజర్ జె.దుర్గాప్రసాద్‌లకు జీఎం అరుణ్‌కుమార్ జైన్ అవార్డులను అందజేశారు. అవార్డులు సాధించిన డివిజన్ సిబ్బందిని విజయవాడ రైల్వే డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు.