
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
పెడన: మద్యానికి బానిసై రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెడన పట్టణంలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. మచిలీపట్నం రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.... పట్టణంలోని రామలక్ష్మీ వీవర్స్ కాలనికి చెందిన సింహాద్రి రమేష్ (52) శనివారం వేకువ జామున గుడివాడ – మచిలీపట్నం ప్యాసింజరు రైలు కింద పెడన– వడ్లమన్నాడు రైలు మార్గంలోని పెడన శివారులో రైలుకు ఎదురువెళ్లాడు. రైలు ఢీ కొట్టడంతో పక్కకు పడి చనిపోయాడు. రైలు డ్రైవర్ ఈ విషయాన్ని రైల్వే పోలీసులకు తెలియజేయడంతో వారు పెడన వచ్చి మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. మృతదేహం ఫొటోను వాట్సప్ గ్రూపుల్లో గుర్తించిన బంధువులు రైల్వే పోలీసులకు పూర్తి వివరాలను అందజేయడంతో వారు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.