
ఐటీఐ అర్హతతో అద్భుత ఉపాధి అవకాశాలు
ఐటీఐ అర్హతతో అద్భుత ఉపాధి అవకాశాలు ఉన్నాయి. సాంకేతిక విద్యపై ఆసక్తి కలిగి, వివిధ కారణాలతో ఉన్నత చదువులకు వీలుకాని వారికి ఐటీఐ విద్యాకోర్సులు చక్కని ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి. ఐటీఐలో చేరదలిచే విద్యార్థులు ఈ నెల 24వ తేదీ వరకు ఐటీఐ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. కోర్సులు పూర్తి చేసిన తరువాత నైపుణ్యం కలిగిన విద్యార్థులకు జాబ్‌మేళాలు నిర్వహించి ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తాం.
– ఎం.కనకారావు,
ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఐటీఐ, విజయవాడ
●