
వైభవంగా శ్రీకృష్ణదేవరాయల మహోత్సవం
ఘంటసాల: తెలుగు భాషలోని నీతులు, సామాజిక రీతులను చిన్నారులకు చెప్పకపోవడం వల్లే నేటి సమాజంలో మానవ సంబంధాలు దెబ్బతింటున్నా యని హై కోర్టు విశ్రాంత న్యాయమూర్తి, ప్రభుత్వ హైపవర్ కమిటీ చైర్మన్ జస్టిస్ యు.దుర్గాప్రసాద్ అన్నారు. ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో వేంచేసియున్న శ్రీకాకుళేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ కృష్ణదేవరాయలు మహోత్సవం బుధవారం రాత్రి వైభవంగా జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి, డీసీ దాసరి శ్రీరామ వర ప్రసాదరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. ఇలాంటి ఉత్సవాలు తెలుగు భాషాభివృద్ధికి దోహదం చేస్తాయని అన్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లా డుతూ.. యావత్ తెలుగు జాతికి స్ఫూర్తినిచ్చిన మహోన్నత వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు అని కొనియాడారు. తెలుగులో ఆముక్తమాల్యద గ్రంథాన్ని రచించారని పేర్కొన్నారు. తొలుత ఈ కార్యక్ర మానికి హాజరైన జస్టిస్ దుర్గాప్రసాద్‌కు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆముక్తమాల్యద మండపంలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి జస్టిస్ దుర్గా ప్రసాద్, ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి.వి.పూర్ణచందు, ఏఏంసీ చైర్మన్ తోట కనకదుర్గ, సర్పంచ్ ఎం.రవి ప్రసాద్, పీసీ చైర్మన్ డి.వెంకటేశ్వరరావు, ప్రత్యేకాధికారి సాయిబాబు, తహసీల్దార్ బి.విజయ ప్రసాద్, ఎంపీడీఓ డి.సుబ్బారావు పాల్గొన్నారు.