
ఆరోగ్య కార్యక్రమాల్లో లక్ష్యాలు సాధించాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాల్లో లక్ష్యాలు సాధించాలని వైద్యాధికారులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని సూచించారు. విజయవాడలోని తన కార్యాలయంలో గ్రామీణ, పట్టణ ప్రాంత వైద్యాధికారులతో ఆమె బుధవారం సమీక్ష స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును సమీక్షించారు. అందులో భాగంగా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల నమోదు, ఎన్‌సీడీ–సీడీ సర్వే, గర్భిణుల నమో దు వంటి కార్యక్రమాల్లో నిర్దేశిత లక్ష్యాలు సాధించాలని డీఎంహెచ్‌ఓ సూచించారు. ఆయా కార్యక్రమాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో డీఎల్‌టీఓ డాక్టర్ ఉషారాణి, డీఐఓ డాక్టర్ శరత్‌బాబు, డెప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఇందుమతి, ఆర్‌బీఎస్‌కే అధికారి డాక్టర్ మాధవీనాయుడు, డీఎంఓ డాక్టర్ మోతీబాబు, డీపీఎంఓ డాక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.