
పోలీస్ ప్రజావాణిలో 77 ఫిర్యాదులు
విజయవాడస్పోర్ట్స్: నగరంలోని పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (ప్రజావాణి)లో ప్రజల నుంచి 77 ఫిర్యాదులను స్వీకరించినట్లు డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) ఎ.బి.టి.ఎస్.ఉదయరాణి తెలిపారు. ఆస్తి, నగదు వివాదాలపై 40, కుటుంబ కలహాలపై ఆరు, మహిళా సంబంధిత నేరాలపై ఐదు, దొంగతనాలపై మూడు, కొట్లాటలపై తొమ్మిది, చిన్నచిన్న ఘటనలపై 14 ఫిర్యాదులను స్వీకరించినట్లు ఆమె చెప్పారు. బాధితులు ధైర్యంగా అధికారులు ముందుకొచ్చి సమస్యలు చెప్పవచ్చన్నారు.
తమ దృష్టికి వచ్చిన సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరిస్తామన్నారు. బాధితులతో మర్యాదగా మసలుకోవాలని సిబ్బందికి సూచించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడిన అనంతరం సదరు ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ అధికారులను ఆదేశించినట్లు డీసీపీ తెలిపారు.