
ప్రీ వెడ్డింగ్ షూట్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం
పిడుగురాళ్ల: పట్టణ శివారు అయ్యప్పస్వామి దేవస్థానం వద్ద హైవే పక్కనున్న సేఫ్టీ రెయిలింగ్‌ను కారు ఢీకొట్టిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా కొండాపూర్‌కు చెందిన బాణావత్ అరవింద్, సోనియాల వివాహం ఈ నెల 23న జరగనున్న నేపథ్యంలో ప్రీ వెడ్డింగ్ షూట్‌కు కోసం చీరాల సముద్ర తీరానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా పిడుగురాళ్ల సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి హైవే పక్కనున్న రెయిలింగ్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురి గాయాలయ్యాయి. ప్రాణ నష్టం జరగకపోయేసరికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే స్థానికుల సమాచారంతో 108 వాహనం ద్వారా పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేశారు. అనంతరం సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.