
చర్మవ్యాధులు సోకకుండా జాగ్రత్తలు
● వేసవిలో శరీరానికి మాయిశ్చరైజర్స్, సన్‌స్క్రీన్ లోషన్స్ రాసుకోవాలి.
● ఎక్కువగా ఎండకు ఎక్స్‌పోజ్ కాకుండా గొడుగు, తలకు టోపీ ధరించాలి.
● ముఖ్యంగా లూజు దుస్తులు, కాటన్‌వి వేసుకోవాలి.
● రాత్రి వేళల్లో సైతం గాలిసోకే ప్రాంతంలో నిద్రించాలి.
● గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. అనంతరం శరీరాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి.
● స్నానం అనంతరం చర్మానికి పౌడర్ రాసుకుంటే చెమట పొక్కులు, ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ నివారించవచ్చు.
● ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ సోకిన వారు వాడే టవల్స్ మరొకరు వాడితే సోకే అవకాశం ఉంది. వాటిని వేడి నీటిలో నానబెట్టి వాష్ చేయాలి.