
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
మైలవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి మైలవరం బైపాస్ రోడ్డులో జరిగింది. సేకరించిన వివరాలు ప్రకారం మైలవరం గ్రామానికి చెందిన పజ్జూరు శివనారాయణ(55) ద్విచక్ర వాహనంపై పశువుల మేతకు గడ్డి తీసుకువస్తున్నాడు. ఎ.కొండూరు మండలం చీమలపాడు నుంచి కూరగాయల లోడుతో విజయవాడ వెళుతున్న నాలుగు చక్రాల ఆటో వాహనానికి గేదె అడ్డు వచ్చింది. దీంతో గేదెను తప్పించబోయి ద్విచక్ర వాహనానికి ఆటో తగిలింది. ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శివనారాయణ రోడ్డుపై పడిపోయాడు. అతని తలకు బలమైన దెబ్బ తగలడంతో ఘటనా స్థలిలోనే మృతి చెందాడు. నాలుగు చక్రాల ఆటోను స్థానికులు అడ్డుకుని నిలిపివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం