
హైకోర్టు మాజీ ఏజీపీ నాగభూషణం మృతి
జగ్గయ్యపేట అర్బన్: వైఎస్సార్ సీపీ నాయకుడు, సీనియర్ న్యాయవాది, హైకోర్టులో ఏజీపీగా సేవలందించిన అమృత నాగభూషణం(60) అనారోగ్యానికి గురై ఆదివారం ఉదయం జగ్గయ్యపేటలో మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాగభూషణం మరణం వార్త తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ నాయకులు.. మృతుడు నాగభూషణం నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు వట్టెం మనోహర్, పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నెపాగ సుందరరావు, న్యాయవాది పసుపులేటి సత్యశ్రీనివాసరావు, పార్టీ పట్టణ యూత్ ప్రధాన కార్యదర్శి గొట్టిపాళ్ల సురేష్, ప్రచార విభాగం అధ్యక్షుడు గోగుల వెంకయ్య ఉన్నారు.
న్యాయవాదుల నివాళులు
బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఫౌండర్, న్యాయవాది నాగభూషణం ఆకస్మిక మృతిపై బార్ కౌన్సిల్ తరఫున పలువురు న్యాయవాదులు నివాళులర్పించారు. సీనియర్ న్యాయవాది రాయపూడి శ్రీనివాసరావు, బార్ మాజీ అధ్యక్షుడు అన్నెపాగ కాంతారావు, న్యాయవాదులు గోనెల వెంకటేశ్వర్లు, దామాల సంతోష్, మన్నెపల్లి బసవరాజు, ఆరేపల్లి వెంకటేశ్వర్లు, ఆలేటి కిషోర్, అన్నెపాగ కిషోర్‌బాబు తదితరులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

హైకోర్టు మాజీ ఏజీపీ నాగభూషణం మృతి