
రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. గుంటుపల్లి సీఏ కన్వెన్షన్ హాల్ సమీపంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని గురువారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందన్నారు. గాయాలు పాలైన వ్యక్తిని విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడని చెప్పారు. మృతుడి వయసు 40–45 ఏళ్లు ఉంటాయని, ఎత్తు 5.6 అడుగులు, తెలుపు అంచు కలిగిన హా్‌ఫ్ హ్యాండ్ నెక్ టీ షర్ట్, నలుపు అంచు కలిగిన కట్ బనియన్, బ్లూకలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడన్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 94406 27084, 90591 21109 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని కోరారు.