
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైఎస్సార్ పింఛను కానుక గురువారం వేకువ జామునే లబ్ధిదారుల ఇంటికొచ్చింది. గ్రామ/వార్డు వలంటీర్లు తెల్లవారుజాము నుంచే నగదు పంపిణీ చేపట్టారు. తొలి రోజు జిల్లాలో వైఎస్సార్ పెన్షన్ కానుక 84.97 శాతం మందికి అందింది. మొత్తం 2,27,781 మంది లబ్ధిదారులు ఉండగా 1,93,549 మందికి పెన్షన్ అందజేశారు. అత్య ధికంగా జి.కొండూరులో 93.59 శాతం, నంది గామ (అర్బన్)లో 88, తిరువూరులో 87.84, విజయవాడ రూరల్‌లో 87.78, ఇబ్రహీంపట్నంలో 87.16 శాతం పంపిణీ పూర్తయింది.
గడపకొచ్చి మురి‘పింఛెన్’