
బీజేపీ నూతన పాలకవర్గ సభ్యులు
గుడివాడటౌన్ : భారతీయ జనతాపార్టీ కృష్ణాజిల్లా నూతన కార్యవర్గ ఎంపిక శుక్రవారం జరిగింది. స్థానిక గౌరీశంకరపురంలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ శ్రీరాజబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నూతన పాలకవర్గ ఎంపిక జరిగింది. జిల్లా నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షులుగా దివి చిన్నయ్య, నడకుదిటి గాయత్రి, తోట రంగనాఽథ్, తిరుమలశెట్టి శంకర్, వలపర్ల వెంకటేశ్వరరావు, వల్లభుని బిక్షం, పాలేపోగు లక్ష్మి, అట్లూరి దిలీప్ కుమార్, ప్రధాన కార్యదర్శులుగా తుంగల మురళీకృష్ణ, సుదర్శనం శేషుకుమార్, పుప్పాల రామాంజనేయులు, అంగడాల సతీష్, కార్యదర్శులుగా దొండపాటి శ్రీనివాసరావు, గాజుల సిద్ధార్థ, బండ్ల గంగాధర్, పామర్తి పవన్, దింటకుర్తి పద్మజ, కోశాధికారిగా వైవీఆర్ పాండురంగారావు, యువజన మోర్చా ఎన్. అయోధ్యరామ్, కిసాన్ మోర్చా డి. శివరామయ్య, మహిళా మోర్చ లీలాకుమారి, ఎస్సీ మోర్చా సీహెచ్ రాజశేఖర్, ఎస్టీ మోర్చా పేరం శ్రీనివాసరావు, ఓబీసీ మోర్చ పి. అశోక్ కుమార్ ఎంపికై నట్లు అధ్యక్షుడు శ్రీరాజబాబు తెలిపారు.