సింగపూర్‌ తెలంగాణ కల్చరల్ సొసైటీ నూతన కార్యవర్గం

SingaporeTelangana Cultural Society New Executive Committee - Sakshi

సింగపూర్: తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) (TCSS)  తొమ్మిదో వార్షిక సర్వ సభ్య సమావేశం నవంబర్ 27వ తేదీన స్థానిక ఆర్య సమాజ్‌లో జరిగింది. ఈ సమావేశంలో కమిటీ ఎనిమిదో సర్వసభ్య సమావేశపు వివరాలతో పాటు 2021-2022 ఆర్థిక సంవత్సరపు రాబడి, ఖర్చుల పట్టికను వివరించి, ఆమోదం పొందింది. 2021-2022 ఆర్థిక సంవత్సర ఆడిటర్లు కిరణ్ కుమార్ ఎర్రబోయిన,  శివ రెడ్డి అద్దులకు  కమిటీ కృతజ్ణతలు తెలిపింది.

నూతన  అధ్యక్షుడుగా  గడప రమేశ్ బాబుతోపాటు, కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం అయినట్టు ఎన్నికల అధికారులు పెద్దపల్లి వినయ్ కుమార్, ముద్రకోల నవీన్ ప్రకటించారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించి ఇక్కడి తెలంగాణ వాసులకు సేవ చేసే అవకాశం ఇస్తున్నందుకు రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. నూతన కార్యవర్గం సహకారంతో సొసైటీని మరింత అభివృద్ధి చేయడానికి శాయశక్తుల కృషి చేస్తానన్నారు. దీనితో పాటు 2022-2023ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లుగా మద్దికుంట్ల రాజు,  శేఖర్ రెడ్డి ఓరుగంటి ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా  ప్రస్తుత అధ్యక్షులు నీలం మహేందర్ మాట్లాడుతు సొసైటీ చేసిన కార్యక్రమాలను వివరించారు. సొసైటీ సంస్థాగత అధ్యక్షులు బండా మాధవ రెడ్డి విలువైన సలహాలు అందించారు. సొసైటీకి ఇంతకాలం సేవలందించిన నీలం మహేందర్, గర్రెపల్లి శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్ చెన్నోజ్వల, గార్లపాటి లక్ష్మారెడ్డి, కొల్లూరి శ్రీధర్, గింజల సురేందర్ రెడ్డి,  వినయ్ కుమార్ పెద్దపల్లి తదితరులకు జ్ఞాపిక అందజేశారు.

నూతన కార్య వర్గం
నూతన కార్య వర్గం, కార్యనిర్వాహక వర్గంలో అధ్యక్షులు గడప రమేష్ బాబు,  ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ఉపాధ్యక్షులు, నల్ల  భాస్కర్ గుప్త, గోనె నరేందర్ రెడ్డి, మిర్యాల సునీత రెడ్డి, దుర్గ ప్రసాద్ మంగలి ప్రాంతీయ కార్యదర్శులు, నంగునూరి వెంకట రమణ, బొండుగుల రాము, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజ్జాపూర్, కార్యవర్గ సభ్యులుగా పెరుకు శివ రామ్ ప్రసాద్, అనుపురం శ్రీనివాస్, బొడ్ల రోజా రమణి, శివప్రసాద్ ఆవుల, శశిధర్ రెడ్డి, ప్రవీణ్ మామిడాల,  సతీష్ పెసరు, రాధికా రెడ్డి, సదానందం  అందె, రవి చైతణ్య  మైసా,  విజయ మోహన్ వెంగళ ఉన్నారు. 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top