హంగేరి, రుమేనియా బోర్డర్‌కి రండి - కేంద్రం కీలక ఆదేశాలు | MEA Requested Stranded Indians In Ukraine to Reach Hungary and Romania Boarder Check post ASAP | Sakshi
Sakshi News home page

బుచరెస్ట్‌ నుంచి ఎయిర్‌లిఫ్ట్‌.. రెండు ప్రత్యేక విమానాలు సిద్ధం

Feb 25 2022 2:09 PM | Updated on Feb 25 2022 2:14 PM

 MEA Requested Stranded Indians In Ukraine to Reach Hungary and Romania Boarder Check post ASAP - Sakshi

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపుకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. హంగేరి, రుమేనియా దేశాలకు దగ్గరగా ఉన్న వారు సరిహద్దుల్లో ఉన్న చెక్‌పోస్టుల వద్దరు రావాలని సూచించింది. ప్రయాణించే సమయంలో తమ వాహనాలపై ఇండియన్‌ ఫ్లాగ్‌ను పెట్టుకోవాలని కోరింది. భారతీయుల తరలింపు కోసం గురువారం రాత్రి నుంచి కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌ హంగరీ, స్లోవేవకియా, రుమోనియా దేశాలకు చెందిన ప్రభుత్వాలతో చర్చలు జరిపారు.  భారతీయుల తరలింపుకు పూర్తి సహకారం అందిస్తామని ఆయా దేశాలు ప్రకటించాయి. దీంతో కేంద్రం వెంటనే కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఉక్రెయిన్‌లో ఇండియన్‌ ఎంబసీ నుంచి వచ్చిన సూచనలు
- విద్యార్థులు హంగేరి, రుమేనియా సరిహద్దులో ఉన్న చెక్‌పోస్ట్‌కి చేరుకోవాలి
- ఉక్రెయిన్‌ సరిహద్దు సమీపంలోని హుజూర్ద్‌, చెర్నీ వెస్ట్ ప్రాంతాలకు చేరుకోవాలి
- స్థానిక విదేశాంగ శాఖ అధికారుల సమన్వయంతో విద్యార్థులు టీమ్‌లుగా బయల్దేరాలని సూచన
- బోర్డర్‌ వచ్చే సమయంలో విద్యార్థులు ప్రయాణించే వాహనాలపై భారత జెండాను ఉంచుకోవాలి
- బోర్డర్‌ వచ్చే ముందు పాస్‌పోర్ట్‌, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లను వెంట తెచ్చుకోవాలి
- బోర్డర్‌ దాటే సమయంలో ఇబ్బందులు రాకుండా సరిహద్దుల వద్ద ప్రత్యేక హెల్ప్‌లైన్‌ సెంటర్ల ఏర్పాటు. ఏమైనా ఇబ్బందులు ఉంటే హెల్ప్‌లైన్‌ సెంటర్లు సహకరిస్తాయి. 
- రొమేనియా రాజధాని బుచరెస్ట్‌కి 2022 ఫిబ్రవరి 26న రెండు ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానాలు పంపిస్తున్న కేంద్రం. 
- బుచరెస్ట్‌ నుంచి భారత పౌరులను ఎయిర్‌లిఫ్ట్ చేసేందుకు ఏర్పాట్లు 
- పశ్చిమ ప్రాంతంలో ప్రస్తుతం విద్యార్థులు ఉన్న స్థావరాల దగ్గర ప్రత్యేక చెక్‌పోస్టుల ఏర్పాటు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement