అడవుల రక్షణపై ఫోకస్‌ | - | Sakshi
Sakshi News home page

అడవుల రక్షణపై ఫోకస్‌

May 5 2026 6:38 AM | Updated on May 5 2026 6:38 AM

ఎకో టూరిజం అభివృద్ధిపై

ప్రత్యేక దృష్టి

నూతన డీఎఫ్‌వో సిద్ధార్థ్‌ విక్రమ్‌సింగ్‌

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): అడవుల రక్షణతోపా టు భూములు ఆక్రమణకు గురికాకుండా స్పెషల్‌ ఫోకస్‌ పెడతానని నూతన జిల్లా అటవీ శాఖ అధికారి (డీఎఫ్‌వో) సిద్ధార్థ్‌ విక్రమ్‌సింగ్‌ అన్నారు. సోమవారం జిల్లా కార్యాలయానికి వచ్చిన ఆయన బాధ్యతలు చేపట్టారు. సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లాలో అడవుల పరిస్థి తి గురించి విక్రమ్‌సింగ్‌ తెలుసుకున్నారు.

అడవుల రక్షణకు క్షేత్ర స్థాయిలో నిఘా పెంచుతామన్నారు. ఎస్సారెస్సీ బ్యాక్‌ వాటర్‌లో ఎకో టూరిజం, మల్లారం పార్క్‌ వంటి పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. అనంతరం కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, సీపీ సాయి చైతన్యను మర్యాద పూర్వకంగా కలిశారు. 2018 ఐఎఫ్‌ఎస్‌ బ్యాచ్‌కు చెందిన విక్రమ్‌సింగ్‌ ఖమ్మం నుంచి ఇక్కడకు బదిలీపై రాగా, ఇక్కడ డీఎఫ్‌వోగా పని చేసిన వికాస్‌మీనా ములుగు జిల్లాకు బదిలీ అయ్యారు.

ప్రజావాణికి

103 ఫిర్యాదులు

నిజామాబాద్‌ అర్బన్‌: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 103 ఫి ర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌, డీఆర్డీవో సాయన్న, జెడ్పీ సీఈవో సాయాగౌడ్‌, డీపీవో శ్రీనివాస్‌కు విన్నవిస్తూ అర్జీలు అందజేశారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. కాగా, సబ్‌ కలెక్టర్‌, ఆర్డీవోల నేతత్వంలో డివిజన్‌ స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత డివిజన్‌ పరిధిలోని తహసీల్దార్‌లు పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పోలీస్‌ ప్రజావాణికి

38 ఫిర్యాదులు

నిజామాబాద్‌ అర్బన్‌: పోలీస్‌ ప్రజావాణిలో భాగంగా సీపీ సాయిచైతన్య ప్రజల నుంచి సోమవారం ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 38 మంది సీపీని కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరారు. సీపీ వెంటనే సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ అధికారులతో మాట్లాడి సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించాలని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement