ఖలీల్‌వాడి: సమయాన్ని వృథా చేయకుండా, సంకల్పంతో కృషి చేస్తే ఉద్యోగం సాధించవచ్చని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉద్బోధించారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు చేసుకుంటూ ఏకాగ్రతతో చదవాలని కర్తవ్యబోధ చేశారు. జిల్లా కేంద్రంలోని నాందేవ్‌వాడ ఎస్సీ వసతి గృహంలో ఎస్సీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసిన ఉచిత ఫౌండేషన్ కోర్సును కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మా ట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాల అభ్యు న్నతి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమ లు చేస్తోందని గుర్తుచేశారు. పోటీ పరీక్షలలో ప్రతి భ కనబర్చి ఉద్యోగాలు సాధించేలా స్టడీ సర్కిల్స్ ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు సమకూరుస్తూ ఉచితంగా శిక్షణ అందిస్తోందని అన్నారు. ఈ అవకాశాన్ని సరైన విధంగా వినియోగించుకుంటే ప్రభుత్వ కొలువు దక్కించుకోవచ్చని, భవిష్యత్తు ఎంతో బాగుంటుందని హితవు పలికారు. ఆంగ్లంలో నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలని సూచించారు. నోటిఫికేషన్లు విడుదల కాకముందు నుంచే ఉద్యోగ పోటీ పరీ క్షలకు సన్నద్ధం కావాలని మార్గనిర్దేశం చేశారు. ఇప్పటి వరకు 10 బ్యాచ్‌లలో 800 మందికి శిక్షణ అందించగా, 199 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని ఎస్సీ స్టడీ సర్కిల్ నిర్వాహకులు కలెక్టర్‌కు వివరించారు. ప్రస్తుతం 11వ బ్యాచ్‌లో 93 మందికి ఐదు నెలలపాటు ఉచిత భోజన వసతి సదుపాయాలతో నాణ్యమైన శిక్షణ అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి అధికారి రజిత, సహాయ అధికారి రాజగంగారాం, స్టడీ సర్కిల్ డైరెక్టర్ దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు.
వసతిగృహాల పరిశీలన
నగరంలోని నాందేవ్‌వాడ ఎస్సీ(బాలుర), సుభాష్‌నగర్ గర్స్ల్ వసతిగృహాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. కోచింగ్ సెంటర్ నుంచి గర్స్ల్ హాస్టల్‌కు దూరమవుతుందని, మరో భవనం చూడాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్‌కుమార్, జిల్లా సహాయ సాంఘిక సంక్షేమ అధికారి రాజగంగారాంను ఆదేశించారు.
పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిస్తే ఉద్యోగం
ఉచిత కోచింగ్‌ను సద్వినియోగం
చేసుకోవాలి
కలెక్టర్ ఇలా త్రిపాఠి


