ధాన్యం బుగ్గిపాలు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం బుగ్గిపాలు

May 2 2026 12:07 PM | Updated on May 2 2026 12:07 PM

డిచ్‌పల్లి: రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం రైస్‌మిల్లుకు వెళుతుందో లేదో గ్యారెంటీ లేకుండా పోయింది. తూకం వేసి బస్తాల్లో నింపి లారీలో లోడింగ్‌ సిద్ధంగా ఉన్న ధా న్యం ప్రమాదవశాత్తు నిప్పంటుకొని దగ్ధమైన ఘటన శుక్రవారం డిచ్‌పల్లి మండలంలో చోటు చే సుకుంది. బాధిత కౌలు రైతు వారాల సురేశ్‌, రెవె న్యూ, వ్యవసాయాధికారులు తెలిపిన వివరాలు ఇ లా ఉన్నాయి. డిచ్‌పల్లి గ్రామానికి చెందిన రైతు సురేశ్‌ తనకున్న ఎకరం పొలంతోపాటు అదే గ్రా మానికి చెందిన అవుసుల వినోద్‌కు చెందిన 4 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి ధాన్యం పండించాడు. మొత్తం 209 బస్తాల ధాన్యం వచ్చింది. ఘన్‌పూర్‌ నుంచి డిచ్‌పల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డు పక్క న ధాన్యం ఆరబోశాడు. డిచ్‌పల్లి సొసైటీ ఆధ్వర్యంలో పది రోజుల క్రితం ధాన్యం తూకం వేసి బస్తాల్లో నింపి, లారీలో లోడ్‌ చేసి రైస్‌మిల్లుకు పంపించేందుకు సిద్ధంగా ఉంచారు. అయితే, లారీలు రాక ఆ లస్యం కావడంతో బస్తాలు రోడ్డు పక్కన అలాగే ఉ న్నాయి. మధ్యాహ్నం సమయంలో భోజనం చేయ డానికి సురేష్‌ ఇంటికి వెళ్లాడు. ఇంతలోనే రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో ఉన్న ఎండిపోయిన పిచ్చిమొక్కలు, ముళ్లపొదలకు నిప్పంటుకుంది. గాలులకు ఆ మంటలు ధాన్యం సంచులను అంటుకున్నాయి. రోడ్డుపై వెళ్లే వాహనదారులు గమనించి వెంటనే సురేశ్‌కు, ఫైరింజన్‌కు సమాచారం ఇచ్చారు. మరికొందరు రైతులతో కలిసి అక్కడికి చేరుకున్న సురేశ్‌ మంటలను ఆర్పివేసేందుకు యత్నించారు. ఇంతలోనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైరింజన్‌ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అప్పటికే 105 సంచులలో ధాన్యం కాలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.లక్ష వరకు నష్టం జరిగినట్లు బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని మండల వ్యవసాయాధికారి ఆంజనేయులు, ఆర్‌ఐ సంతోష్‌, పోలీసు సిబ్బంది సందర్శించారు. పంచనామా నిర్వహించి వివరాలు నమోదు చేసుకున్నా రు. ఎవరైనా సిగరెట్‌ తాగి పడేశారా లేక ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయా తెలియడం లేదని రైతులు పేర్కొన్నారు. బాధిత రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. లారీల సమస్య పరిష్కరించి త్వరగా కొనుగోళ్లు పూర్తయ్యేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని విన్నవించారు.

నిప్పంటుకొని తగలబడిన వడ్ల బస్తాలు

సుమారు రూ.లక్ష నష్టం

లారీల రాక ఆలస్యంతో

పది రోజులుగా రోడ్డు పక్కనే బస్తాలు

ప్రభుత్వం ఆదుకోవాలని కౌలు

రైతు వేడుకోలు

Advertisement
 
Advertisement
Advertisement