మంజీరలో ‘మహా’ ఇసుక తవ్వకాలపై అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

మంజీరలో ‘మహా’ ఇసుక తవ్వకాలపై అప్రమత్తం

May 2 2026 12:07 PM | Updated on May 2 2026 12:07 PM

హున్సా శివారులో సర్వే చేసిన రెవెన్యూ శాఖ

బోధన్‌:తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు మధ్య ప్ర వహిస్తున్న మంజీర నదిలో అంతర్రాష్ట్ర సరిహద్దు వి వాదం ఏళ్లు గడిచినా అపరిష్కృతంగానే మిగిలిపో యింది. బోధన్‌ రెవెన్యూ డివిజన్‌ సాలూర మండలంలోని మందర్న, హున్సా, ఖాజాపూర్‌, సాలూర, తగ్గేల్లి గ్రామాల శివారులో విస్తరించి ఉన్న మంజీర నదిలో ఏటా సరిహద్దు వివాదం తలెత్తుతోంది. తా జాగా మంజీర నదికి అవతలి ఒడ్డున ఉన్న మహా రాష్ట్ర ప్రాంతంలోని బిలోలి తాలూకా బోలేగాం శివారులో ఆ రాష్ట్ర అనుమతి పొందిన కాంట్రాక్టర్లు కొంతకాలంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. బోలేగాం ఇసుక క్వారీ కాంట్రాక్టర్లు హున్సా గ్రామ శివారులోకి తవ్వకాలు చేపడుతున్నారని గ్రామస్తులు శుక్రవారం తహసీల్దార్‌కు సమాచారం అందించారు. దీంతో తహసీల్దార్‌ నవాజ్‌, ఆర్‌ఐ ఆనంద్‌, సర్వేయర్‌ శ్రావణ్‌, సిబ్బంది, పోలీసు బందోబస్తుతో మధ్య మంజీర నదిని సందర్శించి సర్వే చేపట్టారు. మహారాష్ట్ర ఇసుక క్వారీ నిర్వాహకులు మన హద్దుల అంచువరకు వచ్చారని, హద్దు దాటి రాలేదని తహసీల్దార్‌ వివరించారు. మంజీర నది మధ్య వరకు తవ్వకాలు చేపట్టకూడదని క్వారీ నిర్వాహకులను ఆదేశించామని తెలిపారు. రెవెన్యూ అధికారుల వెంట బోధన్‌ రూరల్‌ సీఐ విజయ్‌బాబు, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement