అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ

Apr 15 2026 7:26 AM | Updated on Apr 15 2026 7:26 AM

నందిపేట్‌ (ఆర్మూర్‌): మండల కేంద్రంలో మంగళవారం అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను ఎంపీడీవో శ్రీనివాసరావు అధికారుల తో కలిసి ఆవిష్కరించారు. మంగళవారం నుంచి నుంచి ఏప్రిల్‌ 20వ తారీకు వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని నందిపేట స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ రావుల నరేశ్‌ తెలిపారు. అగ్ని ప్రమాదాలలో అసువులు బాసిన సిబ్బంది స్మారకార్థము ప్రతిఏడాది వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఐలాపూర్‌ సర్పంచ్‌ మీసాల లక్ష్మీనారాయణ, పంచాయతీ కార్యదర్శులు, అగ్నిమాపక సిబ్బంది, మండల పరిషత్‌ సిబ్బంది పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

రుద్రూర్‌: మండల కేంద్రంలో ఆరుగురు బా ధితులకు మంజూరైన రూ.1.99 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను మంగళవారం ఏఎంసీ డైరెక్టర్‌ పార్వతి ప్రవీణ్‌, విండో మాజీ చైర్మన్‌ పత్తి రాము పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వ సలహదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సహకారంతో సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు విడుదలైనట్లు వారు తెలిపారు. వార్డు సభ్యులు ఇమ్రాన్‌, కాంగ్రెస్‌ నాయకులు అక్కపల్లి నాగేందర్‌, నర్సయ్య, ఖాజా, పత్తి నవీన్‌, ఈర్వ నాగరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగులకు వీల్‌ ౖచైర్ల పంపిణీ

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌): భీమ్‌గల్‌ మండలం మెండోర గ్రామంలో పీపుల్స్‌ వెల్ఫేర్‌ అసోసి యేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం దివ్యాంగులకు వీల్‌ చైర్లను పంపిణీ చేశారు. శారీరక ఇ బ్బందులు, అంగవైకల్యం కలిగిన, వృద్ధులకు కలిపి 28 మందికి వీల్‌ చైర్లను అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ జిల్లా ప్రతినిధి సీహెచ్‌ డానియల్‌, సర్పంచ్‌ కుంట లక్ష్మి, ఉప సర్పంచ్‌ రమేష్‌ కంఠం సత్యం, స్పెషల్‌ వర్కర్‌ అశోక్‌, మనోహర్‌, అశోక్‌; కొత్తూరు నరేష్‌, ఆశ వర్కర్‌లు తదితరులు పాల్గొన్నారు.

చలివేంద్రం ప్రారంభం

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): మండలంలోని దత్తాపూర్‌ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బస్టాండ్‌ ఆవరణలో మంగళవారం చలివేంద్రాన్ని సర్పంచ్‌ మూడ్‌ ప్రకాష్‌ ప్రారంభించారు. ఉప సర్పంచ్‌ గోనే గంగాధర్‌, వార్డు సభ్యులు, కారోబార్‌ లక్ష్మినారాయణ పాల్గొన్నారు.

రక్తదాన శిబిరాలకు స్పందన

రెంజల్‌/వర్ని: అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని రెంజల్‌, బోర్గాం గ్రామాల్లో మంగళవారం రక్తదాన శిబిరాలను నిర్వహించారు. యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం ప్రాణదానంతో సమానమ ని ఎస్సై చంద్రమోహన్‌, సర్పంచ్‌లు తిరుపతి లలిత, జ్యోతీకార్తీక్‌యాదవ్‌లు పేర్కొన్నారు. రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. వర్నిలో స్వామి వివేకానంద బ్లడ్‌ డోన ర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా తలసేమియా వ్యాధి చిన్నారుల కోసం శిబిరాన్ని నిర్వహించినట్లు అసోసియేషన్‌ వ్యవస్థాపకులు సంతోష్‌ తెలిపారు.

పోగొట్టుకున్న

ఫోన్ల అందజేత

ఆర్మూర్‌టౌన్‌: ఆర్మూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పొగొట్టుకున్న ఫోన్లను సీఈఐఆర్‌ పోర్టల్‌ద్వా రా సేకరించి మంగళవారం బాధితులకు అందజేసినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్‌ తెలిపారు. సంతోష్‌, విజయ్‌భాస్కర్‌, రవీందర్‌లకు ఫోన్లు అందజేశామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement