ప్రజాపాలనలో అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

ప్రజాపాలనలో అభివృద్ధి

Apr 14 2026 8:34 AM | Updated on Apr 14 2026 8:34 AM

పేదవాడి ముఖంలో చిరునవ్వే

లక్ష్యంగా ముందుకు..

పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌

నిజామాబాద్‌అర్బన్‌: కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే అనేక పనులు చేపట్టడంతోపాటు హామీలను నెరవేర్చిందని పీసీ సీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణతోకలిసి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను మహేశ్‌కుమార్‌గౌడ్‌ సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ప్రజాపాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందన్నారు. అభివృద్ధిని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 గ్యాస్‌ సిలిండర్‌, ఉచిత విద్యుత్‌ వంటి పథకాలు ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. వీటికి తోడు ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, రైతు భరో సా, యువతకు ఉద్యోగాల కల్పన, సన్న బియ్యం పథకాలతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు, నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గానికి చెందిన 591 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. వ్యవసాయ శాఖ కమిషన్‌ సభ్యుడు గడుగు గంగాధర్‌, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి, కార్పొరేషన్‌ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నగర మేయర్‌ ఉమారాణి, నుడా చైర్మన్‌ కేశ వేణు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement