సహజీవనం చేస్తున్న వ్యక్తిని హత్య చేసిన మహిళ | - | Sakshi
Sakshi News home page

సహజీవనం చేస్తున్న వ్యక్తిని హత్య చేసిన మహిళ

Apr 14 2026 8:34 AM | Updated on Apr 14 2026 8:34 AM

నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలోని వినాయక్‌నగర్‌లో సహజీవనం చేస్తున్న వ్యక్తిని ఓ మహిళ చీరతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు 4వ టౌన్‌ ఎస్సై సందీప్‌ సోమవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన మోహన్‌(40) వినాయక్‌నగర్‌లో ఉంటూ మేసీ్త్ర పని చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన బద్ద సౌందర్యతో ఎనిమిదేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఈ నెల 12 ఉదయం 3 గంటలకు సౌందర్య తన చీరను మోహన్‌ మెడకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మోహన్‌ కుటుంబానికి సంబంధించిన వివరాలు తెలియడం లేదన్నారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే 8712659840 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement