మీడియేషన్ సెంటర్ ప్రారంభం
బోధన్: బోధన్ కోర్టు ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఐదో జిల్లా అదనపు న్యాయమూర్తి, న్యాయసేవా అధికార సంస్థ మండల చైర్‌పర్సన్ వరూధిని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసులలో పరిష్కారానికి అవకాశం ఉన్న వాటిని సదరు కోర్టు మధ్యవర్తిత్వ కేంద్రానికి పంపుతుందన్నారు. కక్షిదారులు మధ్యవర్తిత్వ కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేంద్రం నిర్వహణ బాధ్యతలు న్యాయవాది ధర్మయ్యకు అప్పగించారు. కా ర్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం.పూజిత, అదనపు జూనియర్ సివిల్ జడ్జి సాయిశివ, స్పెషల్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ శేషతల్పసాయి, మధ్యవర్తిత్వ కేంద్రం న్యాయవాది ధర్మయ్య, అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ మహ్మద్ గౌసోద్దీన్, అడిషనల్ పబ్లిక్ ప్యాసిక్యూటర్ శ్యాంరావు తదితరులు పాల్గొన్నారు.


