ఎట్టకేలకు మంజూరైన నిధులు
● మాధవనగర్ ఆర్వోబీకి రూ.3కోట్లు కేటాయించిన ప్రభుత్వం
● పున:ప్రారంభమైన పనులు
నిజామాబాద్ రూరల్: మండలంలోని మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడి్‌జ్ పనులు నిధుల కొరతతో కొన్ని నెలలుగా నిలిచిపోగా, పెండింగ్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయడంతో ఎట్టకేలకు పనులు పున:ప్రారంభమయ్యాయి. దీంతో ప్రయాణికులు బ్రిడ్జి పనులు త్వరగా పూర్తికానున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత పది రోజులనుంచి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
మాధవగర్ ఆర్వోబీ పనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.93.12 కోట్లు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తమ వాటా నిధులు మంజూరు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా నిధులను పెండింగ్‌లో ఉంచింది. దీంతో పనులు అసంపూర్తిగా ఆగిపోయాయి. దీంతో ఇటీవల ఎంపీ అర్వింద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్ మాధవనగర్ ఆర్వోబీని సందర్శించి పనులు నిలిచిపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో పనులు ఆలస్యంగా కొనసాగుతున్నాయని, నిధుల విడుదల కోసం ఆందోళనలు చేపడతామని అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇటీవల రూ. 3కోట్ల నిధులను విడుదల చేసింది. నిధులు రావడంతో అధికారులు పనులను ప్రారంభించి, శరవేగంగా చేపడుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా గుంతలు తీసీ ఆర్వోబీ బ్రిడ్జి వద్ద ఫ్లోరింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఆర్వోబీ పనుల్లో రైల్వే ట్రాక్ పైనుంచి వంతెన వేయడమే కీలకం. ఈ పనిని అధికారులు ప్రధానమైనదిగా తీసుకుంటున్నారు. హైవోల్టేజీ కరెంట్ తీగలు, ఫిల్లర్ల మార్కింగ్, వంటి సమస్మాత్మక పనులు అధికారులకు కీలకంగా మారనున్నాయి. దీనికితోడు వంతెనపై పెట్టే రెండు ఆర్చ్‌లు ఇప్పటికే సిద్దంగా ఉన్నాయి. వచ్చే సంవత్సరం నాటికై నా పనులు పూర్తయితే రాకపోకలకు ఇబ్బందులు తప్పుతాయని వాహనదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
త్వరగా పూర్తి చేయాలి..
మాధవనగర్ వద్ద ఆర్వోబీ పనులు త్వరగా పూర్తి చేయాలి. ఇప్పటికే అసంపూర్తి పనులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్వోబీ వద్ద సరైన లైటింగ్ లేక రాత్రివేళలో రోడ్డు ఎక్కడుందో తెలియక వాహనదారులు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పనులను త్వరగా పూర్తిచేయాలి.
–దండు సంజీవ్, బర్ధిపూర్
ఎట్టకేలకు మంజూరైన నిధులు
ఎట్టకేలకు మంజూరైన నిధులు


