రికార్డుల నిర్వహణ సమగ్రంగా ఉండాలి
● సీపీ సాయిచైతన్య
● పోలీస్ స్టేషన్ల రైటర్స్‌కు శిక్షణ
నిజామాబాద్‌అర్బన్: పోలీస్ స్టేషన్‌లలో రికార్డుల నిర్వహణలో సమగ్రంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం ఆయన పోలీస్ స్టేషన్ రైటర్స్‌కు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రికార్డుల నిర్వహణలో నైపుణ్యం పెంపొందించడం, పారదర్శకత, సమయపాలన, పోలీస్ వ్యవస్థ బలోపేతానికి ముఖ్యమైన అంశాలన్నారు. రైటర్స్ కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని వారం రోజులపాటు ఇస్తామన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో ఏవిధంగా ఉండాలో కేసులు నమోదు అయితే ఏ విధంగా సత్వర చర్యలు తీసుకోవాలో తెలియజేశారు. నమోదైన కేసులలో సాంకేతిక పద్ధతులు ఏవిధంగా ఉపయోగించాలని తెలియజేశారు. అదనపు డీసీపీ బస్వారెడ్డి, పోలీస్ శిక్షణ కేంద్రం ఏసీపీ రాజశేఖర్, సీఐ శివరాం తదితరులు పాల్గొన్నారు.
సిబ్బంది అంకితభావంతో పని చేస్తున్నారు
కమిషనరేట్ పరిధిలోని పోలీస్ సిబ్బంది వివిధ విభాగాలలో అంకితభావంతో, నిబద్ధతతో పనిచేస్తున్నారని సీపీ సాయి చైతన్య అన్నారు. నగరంలోని కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం వివిధ విభాగాలలో పనిచేస్తూ ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందికి పతకాలు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అందించే వివిధ పథకాలకు సిబ్బందిని ఎంపిక చేసి పంపుతామన్నారు. పథకాలు కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదనొ, సేవ స్ఫూర్తికి కష్టపడి పనిచేసే నిబద్ధతకు ప్రతీక అన్నారు. అదనపు డీసీపీ రామచంద్రరావు, సిబ్బంది ఉన్నారు.
రికార్డుల నిర్వహణ సమగ్రంగా ఉండాలి


