
పాఠశాలల్లో వైభవంగా బోనాల పండుగ
మోపాల్: మండలంలోని సిర్‌పూర్, మంచిప్ప జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో శనివారం బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. మంచిప్పలో జెడ్పీహెచ్‌ఎస్ నుంచి బోనాలను పెద్దమ్మ గుడి వరకు ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. అలాగే సిర్‌పూర్‌లో పిల్లలు బోనాలు, మంగళహారతులతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కలు చెల్లించారు. కార్యక్రమాల్లో హెచ్‌ఎంలు సత్యనారాయణ, బి సాయిలు, ఉపాధ్యాయులు శ్రావణి, అపర్ణ, సంధ్య, రాజేశ్వరి, పీఈటీ దేవేందర్, శ్యామల, వందన, హజారే శ్రీనివాస్, లలిత, కాసర్ల నరేశ్, రాము, అనురాధ, వసంత పాల్గొన్నారు.
ఖలీల్‌వాడి: నగరంలోని న్యాల్‌కల్ రోడ్డులో ఉన్న వీఎన్‌ఆర్ స్కూల్‌లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ యాదేశ్‌గౌడ్, సిబ్బంది వీణా, ప్రసన్న, శ్రీహరి ఉన్నారు.
జక్రాన్‌పల్లి: మండలంలోని కొలిప్యాక్ జెడ్పీ ఉన్నత పాఠశాల, కలిగోట్ సిద్ధార్థ పాఠశాలల్లో విద్యార్థులు బోనాల పండుగ నిర్వహించారు. ఉపాధ్యాయులు సిరిల్‌రావు, సిద్ధార్థ కరస్పాండెంట్ గంగారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

పాఠశాలల్లో వైభవంగా బోనాల పండుగ

పాఠశాలల్లో వైభవంగా బోనాల పండుగ