
చెట్టును ఢీకొన్న మోపెడ్.. ఒకరి మృతి
నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని సుల్తాన్‌నగర్ గ్రామశివారులో సోమవారం ఉదయం మోపెడ్ వాహనం చెట్టును ఢీకొని మహమ్మద్ గని(36) అనే వ్యక్తి మృతి చెందాడు. మహమ్మద్‌నగర్ గ్రామానికి చెందిన గని పాన్‌షాపు డబ్బా నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పెట్రోల్ కోసం మోపెడ్‌పై వెళ్తున్న గని సుల్తాన్‌నగర్ శివారులో ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొన్నాడు. తలపగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సైనాజీ, తల్లి ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదవశాత్తు కాలువలో పడి..
మోపాల్: మండలంలోని కంజర్ గ్రామానికి చెందిన జే శ్రీనివాస్ (53) ప్రమాదవశాత్తు చెరువు కాలువలో పడి మృతిచెందినట్లు ఎస్సై యాదగిరి గౌడ్ సోమవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. శ్రీనివాస్ రోజూవారీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. కొంతకాలంగా పని చేయకుండా తాగుడికి బానిసయ్యాడు. ఈ నెల 2న ఇంట్లో నుంచి వెళ్లిపోయిన శ్రీనివాస్.. సోమవారం కంజర్ చెరువు కాలువలో మృతదేహామై కనిపించాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు సుకేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
చోరీ కేసులో ఒకరి అరెస్టు
నిజాంసాగర్(జుక్కల్): చోరీ కేసులో ఒకరి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. ఈ నెల 8 మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న మన్నె అంజవ్వ ఇంట్లో అత్రం ప్రశాంత్ అనే వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. నిందితుడిని సోమవారం అరెస్టు చేసి, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.
ద్విచక్రవాహన చోరీలో..
నిజాంసాగర్(జుక్కల్): మాగి గ్రామంలో గత నెల 28న నిర్వహించిన కుస్తీ పోటీల ప్రాంతం నుంచి ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసిన కేసులో నిందితుడు రవిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. ఒడ్డేపల్లి గ్రామానికి చెందిన పొట్లోళ్ల సాయిరాం మాగి గ్రామంలో కుస్తీ పోటీలు తిలకించేందుకు పల్సర్ బైక్‌పై వచ్చాడు. వాహనాన్ని పార్కింగ్ చేసి, కుస్తీపోటీలను తిలకించాడు. అనంతరం వెళ్లి చూడగా బైక్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నర్సింగ్‌రావ్‌పల్లి చౌరస్తా వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా పల్సర్ బైక్‌పై వెళ్తున్న రవిని పట్టుకొని విచారించామని ఎస్సై తెలిపారు. బైక్‌ను తానే దొంగిలించినట్లు నేరం ఒప్పుకున్నాడని పేర్కొన్నారు. దీంతో వాహనాన్ని స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేశామన్నారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
బాల్కొండ: మండలంలోని కిసాన్‌నగర్‌లో తాళం వేసిన ఇంట్లో ఆదివారం రాత్రి దుండగులు చొరబడి భారీ చోరీకి పాల్పడ్డారు. బాల్కొండ ఏఎస్సై చిన్నయ్య తెలిపిన వివరాల ప్రకారం.. జాకీర్ అనే వ్యక్తి తాను అద్దెకు ఉంటున్న ఇంటికి తాళం వేసి సొంతింటికి వెళ్లాడు. ఈ క్రమంలో గుర్తు తెలియిన దుండగులు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి ఇంటి నిర్మాణం కోసం బీరువాలో దాచుకున్న రూ. లక్ష నగదును అపహరించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

చెట్టును ఢీకొన్న మోపెడ్.. ఒకరి మృతి

చెట్టును ఢీకొన్న మోపెడ్.. ఒకరి మృతి

చెట్టును ఢీకొన్న మోపెడ్.. ఒకరి మృతి