
కాన్వొకేషన్‌కు ఏర్పాట్లు ముమ్మరం
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో కాన్వొకేషన్ (స్నాతకోత్సవం) వచ్చే నెల మూడోవారంలో నిర్వహించనున్నారు. గత 12ఏళ్లుగా విద్యార్థులు, అధ్యాపకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుండగా.. జూలై 17, 18వ తేదీల్లో నిర్వహించనున్నట్లు సమాచారం. స్నాతకోత్సవానికి హాజరుకా వాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను వీసీ యాదగిరిరావు ఆహ్వానించగా ఆయన సుముఖత వ్యక్తం చేశా రు. అయితే గవర్నర్ కార్యాలయం నుంచి వచ్చే లేఖ ఆధారంగా కాన్వొకేషన్ నిర్వహణ తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉండగా.. వర్సిటీ అధికారులు బిజీగా ఉన్నారు.
19 ఏళ్లలో ఒకేసారి కాన్వొకేషన్
కాన్వొకేషన్ అనేది వర్సిటీలో పెద్ద పండుగలా భావిస్తారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏడాదికోసారి కాన్వొకేషన్ నిర్వహించాలని యూజీసీ నిబంధనలు చెబుతున్నాయి. 2006 లో తెలంగాణ యూనివర్సిటీ ఏర్పడగా తొలి కాన్వొకేషన్ 2013 నవంబర్ 13న అప్పటి వీసీ ప్రొఫెసర్ అక్బర్ అలీఖాన్ హయాంలో నిర్వహించారు. ఆ తర్వాత ఆ ఊసే లేకుండాపోయింది.
జూలై మూడో వారంలో నిర్వహణ!
గవర్నర్‌ను ఆహ్వానించిన వీసీ
పుష్కర కాలం తర్వాత
రెండో కాన్వొకేషన్
ఉత్సాహంగా ఎదురు చూస్తున్న
విద్యార్థులు