
బోధన్‌టౌన్: బోధన్ శక్కర్‌నగర్ కాలనీలోగల శ్రీరామ ఆలయానికి ఓటాబు సంస్థ వారు ఐఎస్‌వో సర్టిఫికెట్ అందించారు. ఆలయ నిర్వహణ, వివిధ కార్యక్రమాల్లో ఆలయ పాత్ర వంటి అంశాలపై ఓటాబు సంస్థకు ఆలయ కమిటీ దరఖాస్తు చేసింది. సంస్థ ప్రతినిధి రామలక్ష్మి శుక్రవారం ఆలయ కమిటీ ప్రతినిధులకు సర్టిఫికెట్ అందజేశారు.
పీఆర్ ప్రిన్సిపల్ సెక్రెటరీని కలిసిన జెడ్పీ చైర్మన్
నిజామాబాద్‌నాగారం: హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన పంచాయతీరాజ్ అవార్డుల ప్రదానోత్సవంలో శుక్రవారం జెడ్పీ చైర్మన్ విఠల్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్(పీఆర్) శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియాను మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే మంత్రి కేటీఆర్‌ను సైతం కలిశారు.
సానిటేషన్‌పై దృష్టి పెట్టాలి
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది శానిటేషన్‌పై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఆమె మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పండిత్ వినీత పవన్‌తో సానిటేషన్‌పై చర్చించారు. మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్, మున్సిపల్ డీఈ భూమేశ్వర్, ఏఈ రఘు ఉన్నారు.

