
నిజామాబాద్‌అర్బన్: మూల్యాంకనం విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులు నిబద్ధతతో వ్యవహరిస్తూ జాగ్రత్తగా వాల్యుయేషన్ చేయాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం ఇంటర్మీడియట్ మూల్యంకన కేంద్రంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి డీఐఈవో రఘురాజ్ అధ్యక్షత వహించారు. అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి అధ్యాపకుడు నిబంధనల ప్రకారం వ్యవహరించాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దని సూచించారు. జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల మేరకు ప్రతి ఒక్కరు సమయపాలన పాటిస్తూ తమకు కేటాయించిన మూల్యాంకన విధుల్లో నిమగ్నమై పని చేయాలన్నారు.