
ఘటనా స్థలం వద్ద గుమిగూడిన ప్రజలు
కామారెడ్డి క్రైం: కామారెడ్డికి సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం టిప్పర్, వాటర్ ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ను పోలీసులు శ్రమించి కాపాడారు. వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ టిప్పర్ డివైడర్ మధ్యలో చెట్లకు నీరు పోస్తున్న ట్రాక్టర్ ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ కేతావత్ రమేష్ క్యాబిన్‌లో చిక్కుకున్నాడు. దేవునిపల్లి పోలీసులు, స్థానికులు క్రేన్, కట్టర్ సహాయంతో దాదాపు రెండు గంటల పాటు శ్రమించి అతడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు దేవునిపల్లి ఎస్సై ప్రసాద్ తెలిపారు.