
వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు
మోర్తాడ్: ఏర్గట్ల మండలం తడపాకల్ వద్ద శుక్రవారం గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై రాజు తెలిపారు. కోరుట్లకు చెందిన పూసల వెంకటేష్, గొడికె నవీన్ నిర్మల్ నుంచి గంజాయిని కొనుగోలు చేసుకుని వచ్చి తడపాకల్ గోదావరి నది తీరంలో విక్రయిస్తున్నారని తమకు సమాచారం అందగా దాడిచేసి పట్టుకున్నామని వెల్లడించారు. ఇద్దరు యువకుల వద్ద 400 గ్రాముల గంజాయి లభ్యమైందని తెలిపారు. గంజాయి విక్రేతలను పట్టుకోవడంలో సహకరించిన ఏఎస్సై ఇస్మాయిల్, కానిస్టేబుళ్లు విజయ్, గంగాధర్, హోంగార్డు జగదీష్‌ను ఎస్సై అభినందించారు. తహసీల్దార్ జనార్దన్ సమక్షంలో నిందితులను విచారించి కోర్టులో హాజరు పరిచామని చెప్పారు.