
శ్రీనివాస్ (ఫైల్)
సిరికొండ(ధర్పల్లి): ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన వేటూరి శ్రీనివాస్(48) చెరు వులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై వంశీకృష్ణరెడ్డి శుక్రవారం తెలిపారు. శ్రీనివాస్ కూలీ పని చేసుకొ ని జీవించేవాడు. ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. మద్యం విషయంలో భార్యతో గొడవపడి మార్చి 29న ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని ఎస్సై తెలిపారు. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నా డు. శుక్రవారం ఉదయం శ్రీనివాస్ మృతదేహం చెరువులో తేలింది. మృతుడి భార్య రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఆర్మూర్‌లో యువకుడు..
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్‌లోని గోల్‌బంగ్లా ప్రాంతంలో నివాసం ఉంటున్న పికిల్ సిద్ధార్థ(17) శుక్రవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. గోలబంగ్లాకు చెందిన సిద్ధార్థ కొంతకాలం క్రితం మతిస్థిమితం కోల్పోయాడు. శుక్రవారం తల్లి అనిత సిద్ధార్థను ఇంట్లో ఉంచి బీడీ ప్యాకింగ్ వెళ్లింది. మధ్యలో సిద్ధార్థకు ఫోన్ చేయగా లిఫ్ చేయలేదు. ఇంటికి వచ్చి చూడగా ఇంట్లోని హాల్‌లో ఉరివేసుకున్నాడు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుగి తల్లి ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో సురేష్‌బాబు తెలిపారు.