
నిజామాబాద్‌నాగారం: మున్సిపల్ కార్మికులపై, ఉద్యోగులపై దాడులను అరికట్టి, భద్రత కల్పించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ అలీమ్‌కు వినతిపత్రం అందజేశారు. సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు మల్యాల గోవర్ధన్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య, ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులపై, ఉద్యోగులపై భౌతిక దాడులకు దిగటం సరికాదన్నారు. నగరంలోని మాలపల్లిలో చెత్త సేకరణ చేస్తున్న డ్రైవర్ జగధీర్‌పై స్థానిక పండ్ల షాపు యజమాని, అతని అనుచరులు దాడి చేసి గాయపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలన్నారు. నాయకులు చంద్రసింహ, నర్సింగరావు, రవికిరణ్, భూపతి, ఏక్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌వోసీ అందజేత
ధర్పల్లి(ఇందల్‌వాయి): ఇందల్‌వాయి మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన పలు బాధిత కుటుంబాలకు బుధవారం సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌వోసీని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అందజేశారు. సర్పంచ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
చలివేంద్రం ప్రారంభం
ధర్పల్లి(ఇందల్‌వాయి): ఇందల్‌వాయి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో బుధవారం చలివేంద్రంను ఎంపీటీసీ చింతల దాసు ప్రారంభించారు. ప్రయాణికులు కోసం ఆర్టీసీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు కంట్రోలర్ తెలిపారు.
కార్మికులకు కాంగ్రెస్
అండగా ఉంటుంది
నిజామాబాద్‌నాగారం:కార్మికుల సమస్యలు ప రిష్కరించడంలో కాంగ్రెస్‌పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో పర్యటిస్తున్న రేవంత్‌రెడ్డిని బుధవారం ఐఎన్‌టీయూసీ రాష్ట్ర నాయకులు,జిల్లా నాయకులు 327 జిల్లా ప్రధాన కా ర్యదర్శి పుదరి గంగాధర్, ఎడ్ల నాగరాజు కలిసి సత్కరించారు.కార్మికుల సమస్యలను విన్నవించారు. నాయకులు గంగాధర్, వేణుగోపాల్, పెంటచారి, కార్తీక్, మొహినొద్దీన్, శ్రీనివాస్, భూమేష్, అసిఫ్, నాంపల్లి తదితరులున్నారు.
మహిళా రైతులకు సన్మానం
సిరికొండ: మండలంలోని రావుట్ల, నారాయణ పల్లి గ్రామాలకు చెందిన మహిళా రైతులను సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు మహిపాల్ నరేష్, గణేష్, మనీష్, శేఖర్, రనీల్, మధు, గంగాధర్ పాల్గొన్నారు.
టీడీపీకి పూర్వ వైభవం వస్తుంది
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): రాబోవు రోజుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుందని పార్టీ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయానికి ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో కలిసి సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. అనంతరం కార్యక్రమ కరపత్రాలను విడుదల చేశారు. జిల్లా అధ్యక్షులు దేగాం యాదాగౌడ్, నాయకులు రాజన్న, సురేశ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.



