బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
నిర్మల్‌చైన్‌గేట్:బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఏవోకు శుక్రవారం వినతిపత్రం అందించారు. జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ రామగిరి రవీందర్ మాట్లాడుతూ జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, బాలరాజుగౌడ్, జేఏసీ నేత విశారదన్ మహరాజ్ నాయకత్వంలో రాష్ట్రంలోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు పోరాటం ప్రారంభించామని తెలిపారు. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించి, దానిని తొమ్మిదో షెడ్యూల్లో పెట్టి రక్షణ కల్పించాలన్నారు. వినతిపత్రం ఇచ్చినవారిలో జేఏసీ నాయకులు కల్లూరు సుధాకర్‌రాజు, అడ్వకేట్ సుంకరి రాజుచారి, కుందూరు వినోద్, బిక్క శాంతన్, గౌరవ్ విలాస్ ఉన్నారు.


