సిలబస్ పూర్తిచేయండి
తానూరు:ప్రణాళిక ప్రకారం ఇంటర్ సిలబస్ పూర్తి చేయాలని డీఐఈవో పరశురాం సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను శుక్రవారం తనిఖీ చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం సిలబస్ పూర్తిపై అధ్యాపకులు దృష్టిసారించాలన్నారు. విద్యార్థులు కళాశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చూడాలని తెలిపారు. యూడైస్‌లో విద్యార్థుల వివరాలు నమోదు చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. కళాశాలకు క్రమం తప్పకుండా వచ్చి హాజరుశాతం పెంచుకోవాలని సూచించారు. కళాశాలలో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో ఉన్న సీసీ కెమెరాలు, సైన్స్ ల్యాబ్‌ను పరిశీలించారు. ప్రిన్సిపాల్ రాజశేఖర్, అధ్యాపకులు ఉన్నారు.


